
ఇంటర్ ఫలితాలు ఈ వెబ్‌సైట్లలో..
ఇంటర్మీడియెట్ మొదటి,రెండో సంవత్సరం జనరల్,వొకేషనల్ కోర్సుల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి.
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సరం జనరల్, వొకేషనల్ కోర్సుల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.
మార్చిలో జరిగిన ఈ పరీక్షలకు దాదాపు పది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వెబ్‌సైట్ నుంచి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవల్సిందిగా విద్యార్థులు, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఫలితాలు ఈ వెబ్‌సైట్లలో..
bietelangana.cgg.gov.in
tsbie.cgg.gov.in
http://bie.telangana.gov.in
www.sakshieducation.com
www.passorfail.in
www.manabadi.com
www.indiaresults.com