ఎమ్మెల్సీలుగా టీడీపీ నేతల ప్రమాణ స్వీకారం | TDP Leaders swearing as MLCs in AP legislative council | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీలుగా టీడీపీ నేతల ప్రమాణ స్వీకారం

Jun 18 2015 11:31 AM | Updated on Aug 10 2018 7:56 PM

ఎమ్మెల్సీలుగా టీడీపీ నేతల ప్రమాణ స్వీకారం - Sakshi

ఎమ్మెల్సీలుగా టీడీపీ నేతల ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి గవర్నర్ కోటలో ఎంపికైన నలుగురు టీడీపీ నేతలు గురువారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి గవర్నర్ కోటలో ఎంపికైన నలుగురు టీడీపీ నేతలు గురువారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ నేతలు టిడి జనార్దన్, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, జి.శ్రీనివాసులు చేత శాసనమండలి చైర్మన్ చక్రపాణి ప్రమాణ స్వీకారం చేయించారు.అంతకుముందు వీరంతా దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్నారు. అనంతరం ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత శాసనమండలికి చేరుకున్నారు.

కృష్ణా జిల్లా నుంచి టిడి జనార్దన్, నెల్లూరు జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్తోపాటు జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర యాదవ్, చిత్తూరు జిల్లాలోని సీనియర్ నేత జి.శ్రీనివాసులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement