'విష ప్రయోగం వల్లే సునంద పుష్కర్ మృతి' | Sunanda Pushkar died of poisoning, says Alok Sharma | Sakshi
Sakshi News home page

'విష ప్రయోగం వల్లే సునంద పుష్కర్ మృతి'

Jan 21 2014 6:34 PM | Updated on Sep 2 2017 2:51 AM

'విష ప్రయోగం వల్లే సునంద పుష్కర్ మృతి'

'విష ప్రయోగం వల్లే సునంద పుష్కర్ మృతి'

సునంద పుష్కర్ మరణం హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అలోక్ శర్మ ఆదేశించారు.

సునంద పుష్కర్ మరణం హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అలోక్ శర్మ ఆదేశించారు. అయితే విష పూరిత పదార్ధాలు తీసుకోవడమే ఆమె మరణానికి దారి తీసిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సునంద మృతిపై ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని నివేదికలో శర్మ తెలిపారు. అతిగా డ్రగ్స్ తీసుకోవడంతో ఆమె మరణం సంభవించిందని.. ఇలాంటి కేసులో విష ప్రయోగం జరిగిందని చెప్పవచ్చు అని ఎయిమ్స్ వైద్యులు శవపరీక్షలో అనంతరం వెల్లడించారు. 
 
అంతేకాకుండా సునంద చేతులపై డజన్ పైగా గాయాలు, బుగ్గపై ఓ గాయం కూడా ఉందని వైద్యులు నివేదికలో తెలిపారు. తన మరణానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోలేదని, ఆమె కడుపులో ఎలాంటి ఆహార పదార్ధాల నమూనాలు లభించలేదని తెలిపారు. ఆమె మరణించిన హోటల్ గదిలో మానసిక రుగ్మత నుంచి ఉపశమనం పొంతే కొన్నిమాత్రలు లభించాయని పోలీసులు తెలిపారు. 
 
కేంద్రమంత్రి శశి థరూర్ తో సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలతో పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్ తో ట్విటర్ లో గొడవ పడిన మరుసటి రోజే ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో మరణించిన సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement