
ఈ అకీరా.. ఎవరినీ క్షమించదు!!
‘ఆమె పోరాటానికి దిగింది. ఎవరినీ క్షమించదు’ అంటూ అకిరా ఫస్ట్ పోస్టర్ ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
‘ఆమె పోరాటానికి దిగింది. ఇక ఎవరినీ క్షమించదు’ అంటూ అకీరా ఫస్ట్ పోస్టర్ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సోనాక్షి సిన్హా లీడ్ రోల్‌లో తెరకెక్కించిన ఈ సినిమా తొలి పోస్టర్‌ను సోమవారం ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సోనాక్షి సిన్హాతోపాటు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటి కోంకణ్ సేన్ కూడా ఉన్నారు.
మహిళా ప్రాధాన్యమున్న కథతో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ‘అకీరా’గా బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి తొలిసారి యాక్షన్ స్టంట్స్ చూపించబోతున్నది. 2011లో తమిళంలో వచ్చిన ‘మౌనగురు’ సినిమాకు రీమేక్‌గా హిందీలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా మొదట జూలై 4న విడుదలవుతుందని ప్రకటించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కావడంతో సెప్టెంబర్ 2న ప్రేక్షకులు ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
She will fight back. No one will be forgiven! Heres the 1st poster of #Akira & more good news: #AkiraTrailerOnJuly4 pic.twitter.com/nkwiSsYGyL
— AKIRA/Sonakshi Sinha (@sonakshisinha) June 28, 2016