ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం చూసేందుకు వచ్చి ఓ వ్యక్తి మృతి చెందాడు.
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం చూసేందుకు వచ్చి ఓ వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్‌కు చెందిన ఒత్తూరి చైతన్య(24) తొమ్మిది మంది స్నేహితులతో కలసి శనివారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతానికి వచ్చారు.
జలపాతం పైభాగం నుంచి దాటే క్రమంలో చైతన్య కాలు జారి అందులో పడిపోయి మృతి చెందాడు. హైదరాబాద్‌లోని దుండిగల్‌కి చెందిన చైతన్య పుణెలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నాడని మిత్రులు తెలిపారు. మృతదేహాన్ని గజ ఈతగాళ్లు సాయంత్రానికి వెలికితీయగా, బోథ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.