పాకిస్తాన్ గాయకుడిని తిప్పి పంపిన అధికారులు | Singer rahat Fateh Ali Khan Abu Dhabi | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ గాయకుడిని తిప్పి పంపిన అధికారులు

Jan 1 2016 3:47 AM | Updated on Sep 3 2017 2:53 PM

పాకిస్తాన్ గాయకుడిని తిప్పి పంపిన అధికారులు

పాకిస్తాన్ గాయకుడిని తిప్పి పంపిన అధికారులు

హైదరాబాద్‌కు వచ్చిన పాకిస్తాన్ గాయకుడిని ఇమిగ్రేషన్ అధికారులు తిప్పి పంపారు.

శంషాబాద్: హైదరాబాద్‌కు వచ్చిన పాకిస్తాన్ గాయకుడిని ఇమిగ్రేషన్ అధికారులు తిప్పి పంపారు.  హైదరాబాద్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడానికి గురువారం పాకిస్తాన్‌కు చెందిన గాయకుడు రహత్ ఫతే అలీఖాన్ అబుదాబీ నుంచి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో గురువారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.

అయితే, ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం.. పాకిస్తాన్ దేశానికి చెందిన వారికి ఢిల్లీ విమానాశ్రయంలో మాత్రమే ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తిచేస్తారు. కానీ, సదరు గాయకుడు నేరుగా నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీలో కాకుండా హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకోవడంతో అధికారులు తిప్పిపంపినట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement