మార్కెట్లకు స్వల్ప న ష్టాలు | Sensex snaps 3-day rally, closes 43 points lower | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు స్వల్ప న ష్టాలు

Dec 4 2013 2:56 AM | Updated on Sep 2 2017 1:13 AM

మార్కెట్లకు స్వల్ప న ష్టాలు

మార్కెట్లకు స్వల్ప న ష్టాలు

వరుసగా మూడు రోజులు లాభపడ్డ మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మంగళవారం స్వల్పంగా వెనకడుగు వేశాయి.

వరుసగా మూడు రోజులు లాభపడ్డ మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మంగళవారం స్వల్పంగా వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 43 పాయింట్లు నష్టపోయి 20,855 వద్ద ముగిసింది. అయితే రోజు మొత్తం 110 పాయింట్ల పరిధిలో ఊగిసలాడింది. గత మూడు రోజుల్లో 478 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్ సోమవారం నెల రోజుల గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. క్యూ2లో కరెంట్ ఖాతా లోటు 1.2%కు తగ్గడంతో సెంటిమెంట్ బ ల పడినప్పటికీ, విదేశీ మార్కెట్ల నష్టాలు ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు ఉసిగొల్పాయని విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో నిఫ్టీ సైతం 16 పాయింట్లు క్షీణించి 6,202 వద్ద ముగిసింది.
 
 పెట్టుబడులవైపే ఎఫ్‌ఐఐలు
 ఎఫ్‌ఐఐలు రూ. 517 కోట్లు ఇన్వెస్ట్‌చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 671 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. సెన్సెక్స్‌లో డాక్టర్ రెడ్డీస్, సెసా స్టెరిలైట్, ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా 1 శాతం స్థాయిలో నీరసించగా, గెయిల్, జిందాల్ స్టీల్, భెల్, హిందాల్కో 3-1.5 శాతం మధ్య పురోగమించాయి. చిన్న షేర్లలో విల్మర్ గ్రూప్‌నకు వాటా విక్రయం వార్తలతో శ్రీరేణుకా 5 శాతం ఎగసింది. ఈ బాటలో పటేల్ ఇంజినీరింగ్, కల్పతరు పవర్, మెక్‌లాయిడ్ రసెల్, నవభారత్ వెంచర్స్, ఆర్కిడ్, ఆప్టో, ఎడిల్‌వీజ్, ప్రాజ్, ఇండియా ఇన్ఫోలైన్ తదితరాలు 20-6 శాతం మధ్య లాభపడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement