మార్కెట్లకు టాటా గ్రూప్ దెబ్బ | Sensex, Nifty end lower; Tata Steel falls 3% | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు టాటా గ్రూప్ దెబ్బ

Oct 25 2016 4:20 PM | Updated on Sep 4 2017 6:17 PM

ఓ వైపు టాటా గ్రూప్ దెబ్బ.. మరోవైపు ఎఫ్ఎమ్సీజీ, ఐటీ స్టాక్స్ల ఒత్తిడి మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

ఓ వైపు టాటా గ్రూప్ దెబ్బ.. మరోవైపు ఎఫ్ఎమ్సీజీ, ఐటీ స్టాక్స్ల ఒత్తిడి మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 87.66 పాయింట్ల నష్టంతో 28,091.42 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 8700 దిగువన 8691.30 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏషియన్ పేయింట్స్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు టాటా గెయినర్లుగా లాభాలు పండించగా, మహింద్రా అండ్ మహింద్రా, టాటా స్టీల్, గెయిల్, హెచ్యూఎల్, ఓఎన్జీసీలు నష్టాలను గడించాయి. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తప్పిస్తూ టాటా సన్స్ ఊహించని నిర్ణయం తీసుకోవడం, టాటా గ్రూప్ స్టాక్స్పై, స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. 
 
టాటా గ్రూప్ అన్ని కంపెనీల్లో టాటా స్టీల్ ఎక్కువగా నష్టాలను చవిచూసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీలో ఈ కంపెనీ షేర్లు దాదాపు 3 శాతం కిందకి దిగజారాయి. ఇతర కంపెనీలు టాటా పవర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసు, టాటా మోటార్స్ 1-2శాతం నష్టాల్లో ముగిశాయి. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో పెట్టుబడిదారులు టాటా స్టాక్స్లో లాభాల స్వీకరణకు మొగ్గుచూపారని, దీర్ఘకాలికంగా ఈ పరిణామాలు చోటుచేసుకోవని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఆసియన్ మార్కెట్లు మిక్స్డ్గా ముగిశాయి. మూడో క్వార్టర్లో దక్షిణ కొరియా ఆర్థిక వృద్ధి నెమ్మదించిందని డేటా వెలువడగానే, ఆ దేశ షేర్ మార్కెట్లు పడిపోయాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 66.84గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.63 లాభంతో 29,826గా నమోదైంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement