జియో ఎపెక్ట్‌: బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్‌ | Reliance Jio Effect: BSNL Offers 2GB Data Per Day, Unlimited Calls at Rs. 339 | Sakshi
Sakshi News home page

జియో ఎపెక్ట్‌: బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్‌

Mar 16 2017 7:58 PM | Updated on Sep 5 2017 6:16 AM

జియో ఎపెక్ట్‌: బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్‌

జియో ఎపెక్ట్‌: బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్‌

బిఎస్ఎన్ఎల్ ఈ కొత్త ప్లాన్‌లో రూ. 339 రీచార్జ్‌పై రోజుకు 3జీ 2జీబీ డాటా ఆఫర్‌ చేస్తోంది.

న్యూఢిల్లీ: వినియోగదారులకు  టెలికాం సంస్థల  ఆఫర్ల పరంపర కొనసాగుతోంది. ముఖ్యంగా ఇంటర్నెట్‌ సేవల్లోఉచిత ఆఫర్లతో జియో దూసుకురావడంతో  దేశీయ దిగ్గజ టెలికాం ఆపరేటర్లు తమ తారిఫ్‌ లను తరచూ సమక్షీంచుకుంటున్నాయి. తాజాగా  ప్రభుత్వ రంగ టెలికాం సర్వీసుల సంస్థ బీఎస్ఎన్ఎల్  తన  ఖాతాదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది.  బిఎస్ఎన్ఎల్ ఈ  కొత్త ప్లాన్‌లో   రూ. 339  రీచార్జ్‌పై రోజుకు 3జీ  2జీబీ డాటా ఆఫర్‌ చేస్తోంది.  బీఎస్ఎన్ఎల్ టు బీఎస్ఎన్ఎల్  అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని 28 రోజుల కాలపరిమితిలో పొందవచ్చని తెలిపింది.  దీంతోపాటు ఇతర నెట్‌ వర్క్‌లలో రోజుకు 25 నిమిషాల టాక్‌ టైం  ఉచితం. ఈ ఆఫర్ 90 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుందని  సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

తమ విలువైన కస్టమర్లకోసం సరసమౌన ధరల్లో సేవలను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని  బీఎస్‌ఎన్‌ఎల్‌ కన్స్యూమర్ మొబిలిటీ  డైరెక్టర్‌ ఆర్.కె. మిట్టల్ తెలిపారు.  అలాగే ప్రతీ రోజు 25 నిమిషాల చొప్పున ఇతర నెట్వర్క్‌లకు ఉచిత కాలింగ్‌ సదుపాయాన్ని కూడా అందిస్తున్నామన్నారు.   ఈ పరిధి దాటిన తరువాత నిమిషానికి 25 పైసలు చార్జ్‌ చేయనున్నట్టు ఆయన తెలిపారు.

కాగా  రిలయన్స్ జియో ఇస్తున్న ఉచిత కాల్స్ పథకానికి, అలాగే ఏప్రిల్ 1నుంచి ప్రారంభించనున్న రూ.303  ప్రైమ్‌  మెంబర్‌షిప్‌ పథకాన్ని తీసుకొచ్చింది. అనంతరం ఇతర మేజర్‌ కంపెనీలు ఎయిర్‌ టెల్‌, వొడాఫోన్‌ జియోధీటుగా మరిన్ని ఆఫర్లను ప్రకటించింన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement