బిల్డింగ్లో తీవ్రవాదులు ... పోలీసులు కాల్పులు | police, terrorists encounter in jammu and kashmir | Sakshi
Sakshi News home page

బిల్డింగ్లో తీవ్రవాదులు ... పోలీసులు కాల్పులు

Jan 14 2015 10:09 AM | Updated on Aug 21 2018 5:46 PM

బిల్డింగ్లో తీవ్రవాదులు ... పోలీసులు కాల్పులు - Sakshi

బిల్డింగ్లో తీవ్రవాదులు ... పోలీసులు కాల్పులు

తీవ్రవాదులు, పోలీసులకు మధ్య హోరాహోరీ కాల్పులతో జమ్మూ కాశ్మీర్ సోపోర్ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది.

జమ్మూ కాశ్మీర్: తీవ్రవాదులు, పోలీసులకు మధ్య హోరాహోరీ కాల్పులతో జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. సోపోర్లోని ఓ భవంతిలో లష్కరే తోయిబా తీవ్రవాదులు ఆశ్రయం పోందారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో వారు ఆ ప్రాంతానికి చేరుకుని పలు నివాసాలలో తనిఖీలు చేపట్టారు.

ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైయన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. దాంతో ఇరువైపులా హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. అయితే తీవ్రవాదులు ఆశ్రయం పొందిన నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement