పజ్జూరులో త్వరలో తవ్వకాలు | Pajjuru In Excavations soon | Sakshi
Sakshi News home page

పజ్జూరులో త్వరలో తవ్వకాలు

Jan 22 2016 2:18 AM | Updated on Mar 23 2019 7:56 PM

పజ్జూరులో త్వరలో తవ్వకాలు - Sakshi

పజ్జూరులో త్వరలో తవ్వకాలు

నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామ శివారు పరిధి పాటివారి స్థలంలో తొలి చారిత్రక యుగం నాటి ఆనవాళ్లు లభించాయని...

పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్ బ్రహ్మచారి
తిప్పర్తి: నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామ శివారు పరిధి పాటివారి స్థలంలో తొలి చారిత్రక యుగం నాటి ఆనవాళ్లు లభించాయని, త్వరలో తవ్వకాలు చేపట్టనున్నామని పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్ బ్రహ్మచారి తెలిపారు. గురువారం ఆయన పజ్జూరులో పాటివారి స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. తవ్వకాలకు సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి వచ్చిందని, రైతులు, గ్రామస్తుల సహకారంతో నాటి ఆధారాలను వెలికితీయనున్నట్లు తెలిపారు.

ఒకటి, రెండో యుగం కాలం నాటి ఆనవాళ్లు లభించడంతోపాటు 10, 12వ యుగం నాటి ఆలయం కూడా ఇదే గ్రామంలో ఉందని, ఈ తవ్వకాలతో మధ్యకాలంలో ఉన్న చరిత్ర, ఆధారాలు బయటపడే అవకాశముందని చెప్పారు. ఆయన వెంట పురావస్తుశాఖ అధికారులు నాగరాజు, భానుమూర్తి, తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement