ఏయిర్‌పోర్ట్‌లో నైజీరియన్ అరెస్ట్ | Nizerian to arrest in Airport of Shamsabad | Sakshi
Sakshi News home page

ఏయిర్‌పోర్ట్‌లో నైజీరియన్ అరెస్ట్

Sep 15 2015 11:12 PM | Updated on Oct 22 2018 6:02 PM

సోషల్ మీడియా ద్వారా భారీ మోసాలకు పాల్పడుతున్న ఓ నైజీరియన్ మోసగాడిని శంషాబాద్ విమానాశ్రయంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు.

శంషాబాద్ : సోషల్ మీడియా ద్వారా భారీ మోసాలకు పాల్పడుతున్న ఓ నైజీరియన్ మోసగాడిని శంషాబాద్ విమానాశ్రయంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఈ నైజీరియన్.. విత్తనాల కంపెనీ ప్రతినిధిగా సుమారు రూ. 50 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి.

దీంతో నైజీరియా నుంచి వచ్చిన అతడిని జార్ఖండ్ పోలీసులు మాటు వేసి మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయంలో అరె స్టు చేశారు. అనంతరం రాజేంద్రనగర్ ఎనిమిదో మెట్రోపాలిటన్ కోర్టుకు తరలించారు. కోర్టు సమయం మించి పోవడంతో పోలీసులు తిరిగి అతడిని కస్టడీకి తీసుకుని శంషాబాద్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement