నేపాల్ ప్రధానిగా ప్రచండ ఎన్నిక
నేపాల్ కొత్త ప్రధానిగా మావోయిస్టు చీఫ్ ప్రచండ బుధవారం ఎన్నికయ్యారు. పదవికి ఆయనొక్కరే పోటీపడ్డారు.
	కఠ్మాండు:  నేపాల్ కొత్త ప్రధానిగా మావోయిస్టు చీఫ్ ప్రచండ బుధవారం ఎన్నికయ్యారు. పదవికి ఆయనొక్కరే పోటీపడ్డారు. పార్లమెంటులో జరిగిన ఎన్నికలో సీపీఎన్-మావోయిస్టు సెంటర్ చీఫ్ అయిన ప్రచండకు అనుకూలంగా 363 ఓట్లు , వ్యతిరేకంగా 210 ఓట్లు వచ్చాయి.  595 మంది సభ్యులకుగాను 22 మంది ఓటేయలేదు.
	
	
	సభలో అతిపెద్ద పార్టీ నేపాలీ కాంగ్రెస్, యునెటైడ్ డెమొక్రటిక్ మధేసి ఫ్రంట్, ఫెడరల్ అలయెన్స్ సభ్యులు,  చిన్న పార్టీలు ప్రచండకు మద్దతు పలికాయి. మావోయిస్టుల మద్దతు వాపసుతో ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అవసరమైంది. ప్రచండను భారత ప్రధాని మోదీ ఫోన్లో అభినందించారు. ప్రచండ 2008- 2009 మధ్య ప్రధానిగా ఉన్నారు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
