మరో సూపర్ స్పోర్టీ బైక్ లాంచ్..హాట్ సేల్

మరో సూపర్ స్పోర్టీ బైక్ లాంచ్..హాట్ సేల్


పుణే: ఇటాలియన్ స్పోర్ట్ బైక్స్  బ్రాండ్ గురించి  ప్రపంచంలోని  బైక్ లైవర్స్ కు  పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయంగా   గుర్తింపు పొందిన ఇటలీకి చెందిన ప్రీమియం హై పర్ఫార్మెన్స్ సూపర్ బైక్స్ తయారీ కంపెనీ ఎంవీ అగస్టా  మరో సూపర్ స్పోర్టీ  బైక్ ను భారత మార్కెట్లో లాంచ్  చేసింది.  'ఎంవి అగస్టా ఎఫ్3  800 ఆర్సీ'  అనే కొత్త మోడల్ ప్రవేశపెట్టింది.  రూ 19.5 లక్షలు (ఎక్స్-షోరూమ్ పూణే) గా నిర్ణయించింది. చాలా లిమిటెడ్  సంఖ్యలో దీన్ని లాంచ్ చేసినట్టు తెలిపింది. అయితే   తొమ్మిది  బైక్ లలో అప్పుడే  అయిదు బైక్ లు అమ్ముడు పోవడం విశేషమని అగస్టా  తెలిపింది.  గతంలో భారత్ లో లాంచ్ చేసిన ఎఫ్4', 'ఎఫ్3' 'బ్రుటలె 1090' మోడల్స్ లాగానే ఉండనుందని పేర్కొంది.


తొమ్మిది  స్టన్నింగ్ సాంపిల్స్ ను ఇండియాకు  తీసుకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇప్పటికే ఇటలీలో బయలుదేని  ఈ  బైక్ ను సరిగ్గా పండుగ సీజన్ లో బైక్ యజమానులకు అందుబాటులోకి తీసుకురానున్నామని  అగస్టా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజింక్య ఫిరోడియా తెలిపారు.


ఇందులో 798 సీసీ ,3 సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. పవర్ 148 హెచ్‌పీ.  ఇది గంటకు 269కిలోమీటర్ల వేగంతో  దూసుకుపోతుంది.  దీని పవర్ 144 హెచ్‌పీ. అలాగే ఇతర ఎంవీ  మెడల్స్ మాదిరిగానే   ఇది కూడా  సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్ సహా, 4 మెడెస్ ,   8లెవల్  ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ తో అలరించేందుకు దూసుకొస్తోంది.


ప్రతీ బైక్ ను   ప్రపంచ ప్రఖ్యాత బైక్ రేసర్స్  జూల్స్ క్లూజెల్ అండ్  లోరెంజో జానెట్టి  ఆటో గ్రాఫ్ తో  పరిమిత ఎడిషన్ సీరియల్ నంబర్ తో దాని ఐడీ ప్లేక్ లభించడం మరో స్పెషాల్టీ.  మరిన్ని వివరాలు కోసం www.motoroyale.in కి లాగిన్ అవ్వొచ్చు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top