ఎన్ని నెలలుగా వెంటబడుతున్నా, ఎన్నిసార్లు ప్రాధేయపడినా తనను ప్రేమించటం లేదంటూ ఓయువకుడు ఎమ్మెల్యే కూతురిపై దాడికి పాల్పడ్డాడు.
ఎమ్మెల్యే కూతురిపై దాడి
Apr 3 2017 5:30 PM | Updated on Oct 30 2018 5:17 PM
ప్రేమించాలంటూ ఎమ్మెల్యే కూతురిపై దాడి
పూణే(మహారాష్ట్ర): ఎన్ని నెలలుగా వెంటబడుతున్నా, ఎన్నిసార్లు ప్రాధేయపడినా తనను ప్రేమించటం లేదంటూ ఓయువకుడు ఎమ్మెల్యే కూతురిపై దాడికి పాల్పడ్డాడు. యావత్మాల్ జిల్లాకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె(22) వాకాడ్‌లోని ఓ కళాశాలలో ఎంబీఏ చదువుకుంటోంది. హర్యానాకు చెందిన యువకుడు(25) కూడా అదే కళాశాలలో చదువుకుంటున్నాడు.
గత కొన్ని నెలలుగా ఆమె వెంటబడుతున్నాడు. ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. అయితే, ఆమె తిరస్కరిస్తూ వస్తోంది. దానిని మనస్సులో పెట్టుకున్న ఆ యువకుడు సోమవారం ఉదయం కళాశాల బయట ఆమెను అడ్డగించాడు. ప్రేమించటం లేదంటూ కత్తితో దాడికి దిగాడు. బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతడిని పట్టుకుని, పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి చేతులకు గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
Advertisement
Advertisement