కట్జూ వ్యవహారం నిరర్థకం: మన్మోహన్ | Katju controversy a 'futile' issue | Sakshi
Sakshi News home page

కట్జూ వ్యవహారం నిరర్థకం: మన్మోహన్

Jul 28 2014 1:05 AM | Updated on Mar 29 2019 9:24 PM

కట్జూ వ్యవహారం నిరర్థకం: మన్మోహన్ - Sakshi

కట్జూ వ్యవహారం నిరర్థకం: మన్మోహన్

తమిళనాడు జడ్జిని కొనసాగించే విషయంలో ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు రాజీ పడ్డారంటూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ రేపిన వివాదం నిరర్థకమైందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.

న్యూఢిల్లీ: తమిళనాడు జడ్జిని కొనసాగించే విషయంలో ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు రాజీ పడ్డారంటూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ రేపిన వివాదం నిరర్థకమైందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఈ వివాదంపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న మన్మోహన్ ఎట్టకేలకు స్పందించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ ఇప్పటికే ఈ వివాదంపై మాట్లాడారని.. ఇక తాను కామెంట్ చేయటానికి ఏమీ లేదని స్పష్టం చేశారు.
 
 ‘జడ్జీల బిలు’లపై అభిప్రాయాలు కోరనున్న  కేంద్రం


 జడ్జీలను జడ్జీలే నియమించే ప్రస్తుత కొలీజియం వ్యవస్థ స్థానంలో జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకోనుంది. దీనిపై న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారమిక్కడ న్యాయ నిపుణులు, మాజీ జడ్జీలతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement