ఏడు వారాలుగా ఎడతెగని ‘స్తంభన’ | Irishman gets seven week erection after cycling accident | Sakshi
Sakshi News home page

ఏడు వారాలుగా ఎడతెగని ‘స్తంభన’

Jan 16 2014 1:47 AM | Updated on Sep 2 2017 2:38 AM

సైకిల్‌పై వెళుతుండగా చిన్నపాటి ప్రమాదానికి గురైన ఇరవెరైండేళ్ల ఐరిష్ యువకుడు ఇబ్బందికరమైన పరిస్థితిలో చిక్కుకున్నాడు.

లండన్: సైకిల్‌పై వెళుతుండగా చిన్నపాటి ప్రమాదానికి గురైన ఇరవెరైండేళ్ల ఐరిష్ యువకుడు ఇబ్బందికరమైన పరిస్థితిలో చిక్కుకున్నాడు. హ్యాండిల్‌కు, సీటుకు మధ్యనున్న సైకిల్‌బార్ గట్టిగా తాకడంతో ఏడువారాలుగా అతడి పురుషాంగం స్తంభించిపోయింది. అది తిరిగి సాధారణ స్థితికి చేరుకోకపోవడంతో అతడు నానా తంటాలు పడుతున్నాడని ‘ఐరిష్ ఇండిపెండెంట్’ దినపత్రిక వెల్లడించింది.
 
 చివరకు అతడు డబ్లిన్‌లోని టాలాట్ ఆస్పత్రిలో చికిత్స పొందాక తన బాధ నుంచి ఉపశమనం పొందినట్లు తెలిపింది. కాగా, పురుషాంగంలోకి అసాధారణంగా రక్తప్రసరణ కావడంతో ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని ‘ఐరిష్ మెడికల్ జర్నల్’ వివరించింది. చికిత్స చేయకుండా విడిచిపెడితే, పురుషాంగంలో రక్తం గడ్డకట్టి ప్రాణాంతకంగా మారుతుందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement