ఫిలిప్పీన్స్లో దుండగులు జరిపిన దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. బటాక్ నగరంలో నివసించే జస్వీందర్‌సింగ్ (38) మంగళవారం కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై తుపాకులతో కాల్పులు జరిపారు.
మనీలా: ఫిలిప్పీన్స్లో దుండగులు జరిపిన దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. బటాక్ నగరంలో నివసించే జస్వీందర్‌సింగ్ (38) మంగళవారం కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ సమయంలో జస్వీందర్ సోదరుడు అమరీందర్‌సింగ్ కూడా కారులోనే ఉన్నారు.
మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు జస్వీందర్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా బుల్లెట్ గాయాలైన అతనిని బాటిక్ నగరంలోని ఒక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు చెప్పారు. జస్వీందర్ సోదరుడు అమరీందర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు.
కాగా, జస్వీందర్‌పై కాల్పులు జరిపిన వ్యక్తులు ఎవరు, ఎందుకు కాల్పులు జరిపారనే విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నెల రోజుల వ్యవధిలో దుండగుల కాల్పుల్లో మరణించిన రెండో భారతీయుడు జస్వీందర్. ఆగస్‌టలో ఓల్‌డ ఎమర్‌స బీచ్ రిసార్‌టలో పంజాబ్‌కు చెందిన రమణ్‌దీప్‌సింగ్ గిల్‌పై దుండగులు కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.