వెస్టిండీస్-ఎతో అనధికారిక తొలి టెస్టులో భారత్-ఎ కష్టాల్లో పడింది. ఓవర్నైట్ స్కోరు 124/3తో మ్యాచ్ మూడో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్-ఎ 245 పరుగులకు ఆలౌటైంది.
వెస్టిండీస్-ఎతో అనధికారిక తొలి టెస్టులో భారత్-ఎ కష్టాల్లో పడింది. ఓవర్నైట్ స్కోరు 124/3తో మ్యాచ్ మూడో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్-ఎ 245 పరుగులకు ఆలౌటైంది. జునేజా (84) మినహా ఇతర బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. భారత్ 121 పరుగులకే చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. విండీస్ బౌలర్లు పెరుమాళ్ ఐదు, మిల్లర్ నాలుగు వికెట్లు పడగొట్టారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. కీరన్ పావెల్ (68) హాఫ్ సెంచరీ చేశాడు. పర్వేజ్ రసూల్ రెండు వికెట్లు తీశాడు. కాగా కరీబియన్లు ఓవరాల్గా 314 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో 429 పరుగులు సాధించారు.