
రూ.5 వేల కోట్ల అప్రకటిత ఆదాయం గుర్తింపు
ఐటీ శాఖ అధికారులు చేసిన దాడుల్లో రూ.5,343.29 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించారు.
న్యూఢిల్లీ: పాత పెద్దనోట్ల ఉపసంహరణ తర్వాత దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు చేసిన దాడుల్లో రూ.5,343.29 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించారు. రూ.611.48 కోట్ల విలువైన ఆభరణాలు, నగదును జప్తు చేశారు. జప్తు చేసిన నగదులో రూ.114.1 కోట్లు కొత్త నోట్ల రూపంలో ఉంది.
నవంబరు 9 నుంచి జనవరి 8 మధ్య అధికారులు ఆదాయపు పన్ను చట్టం కింద 1,156 సోదాలు, సర్వేలు, విచారణలు చేశారు. పన్ను ఎగ్గొట్టడం, హవాలా వ్యాపారం ఆరోపణలపై వివిధ సంస్థలకు 5,184 నోటీసులు ఇచ్చారు. 535 కేసులను సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లకు ఐటీ అధికారులు సిఫార్సు చేశారు. అలాగే నోట్లరద్దు సమయంలో నల్లధనాన్ని దాచుకునేందుకు సహకారబ్యాంకులు బాగా ఉపయోగపడ్డాయని ఐటీ శాఖ పేర్కొంది.