ఎన్ జేఏసీ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆశ్చర్యం కలిగించిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: నేషనల్ జ్యూడిషియల్ అపాయింట్ మెంట్ కమిషన్(ఎన్ జేఏసీ) రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆశ్చర్యం కలిగించిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని, న్యాయనిపుణులతో చర్చించిస్తామని తెలిపారు. మెజారిటీ రాష్ట్రాలు ఎన్ జేఏసీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.
దేశ ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్ సభ, రాజ్యసభ సభ్యుల పూర్తి మద్దతుతో ఎన్ జేఏసీ ఏర్పాటైందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు పూర్తి పాఠం ఇంకా చదవలేదని, ఈ సమయంలో తీర్పుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. నేషనల్ జ్యూడిషియల్ అపాయింట్ మెంట్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని, పాత పద్ధతిలోని కొలీజియం ద్వారానే న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని సుప్రీంకోర్టు నేడు స్పష్టం చేసింది.