ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడాదికి 400 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరుచేస్తామని సీఎం చెబుతున్నారని, ఈ లెక్కన సగటున ప్రతి గ్రామానికి మూడుఇళ్లు
సీఎంకు ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్ : ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడాదికి 400 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరుచేస్తామని సీఎం చెబుతున్నారని, ఈ లెక్కన సగటున ప్రతి గ్రామానికి మూడుఇళ్లు కూడా రావని, యాభైఏళ్లకు కూడా అర్హులందరికీ ఇళ్లు రావని బీసీ సంక్షేమసంఘం నేత ఆర్.కృష్ణయ్య ధ్వజమెత్తారు. ఈ నిర్ణయాన్ని మార్చుకుని, అర్హులందరికీ ఇళ్లు మంజూరుచేయాలని ఆయన సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన దీనిపై సీఎంకు ఒక లేఖ రాస్తూ, వచ్చే నాలుగేళ్లలో అర్హులందరికీ ఇళ్లు రావాలంటే ప్రతి నియోజకవర్గానికి ఏటా 3వేల ఇళ్లు మంజూరుచేయాలని కోరారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 నియోజకవర్గాల్లోని 16 నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లులేని పేదలున్నందున, ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి 5వేల చొప్పున ఇళ్లు మంజూరుచేయాలని విజ్ఞప్తిచేశారు.