27శాతం పెరిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభం | HDFC Bank Q2 profit rises 27% to Rs 1982cr, NII disappoints | Sakshi
Sakshi News home page

27శాతం పెరిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభం

Oct 16 2013 12:57 AM | Updated on Sep 1 2017 11:40 PM

ప్రైవేటు రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక నికర లాభంలో 27% వృద్ధిని నమోదు చేసింది.

ముంబై: ప్రైవేటు రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక నికర లాభంలో 27% వృద్ధిని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి రూ.1,560 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ.1,982 కోట్లకు చేరింది.   బ్యాంకు మొత్తం ఆదాయం రూ.10,146 కోట్ల నుంచి రూ.11,938 కోట్లకు పెరిగింది.

ఈ సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం 15 శాతం వృద్ధితో 3,731 కోట్ల నుంచి రూ.4,476 కోట్లకు చేరినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్  పేర్కొంది. కాని బ్యాంకు నికర వడ్డీ లాభదాయకత స్వల్పంగా క్షీణించగా, నిరర్ధక ఆస్తులు స్వల్పంగా పెరిగాయి. ఈ సమీక్షా కాలంలో నికర వడ్డీ లాభదాయకత(నిమ్) 4.4 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గగా, స్థూల ఎన్‌పీఏ 1.04 శాతం నుంచి 1.09 శాతానికి పెరిగింది. నికర ఎన్‌పీఏ 0.3 శాతం వద్ద స్థిరంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement