ముఖ్యమంత్రి కాన్వాయ్పై దాడి | Gogoi's convoy attacked | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి కాన్వాయ్పై దాడి

Aug 18 2014 4:34 PM | Updated on Sep 2 2017 12:04 PM

నాగాలాండ్-అస్సాం సరిహద్దులలో అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ వాహనశ్రేణి(కాన్వాయ్)పై నిరసనకారులు దాడి చేశారు.

సరుపతార్(అస్సాం): నాగాలాండ్-అస్సాం సరిహద్దులలో అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ వాహనశ్రేణి(కాన్వాయ్)పై నిరసనకారులు దాడి చేశారు. తరుణ్ గొగోయ్ ఈరోజు నాగాలాండ్ సరిహద్దులలోని గోల్ఘాట్ జిల్లాలోని యురియంఘాట్ సందర్శనకు వెళ్లారు. సీఎం వాహనశ్రేణిపై నిరసనకారులు దాడి చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు  చేశారు.

 అల్లరిమూకలు కాన్వాయ్పై రాళ్లు రువ్వారని, రెండు వాహనాలు దెబ్బతిన్నాయని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఏపి రూట్ చెప్పారు.  గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గాలిలోకి కాల్పులు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement