స్వచ్ఛ భారత్ కోసం ఒకరోజు కేటాయించాలని హాస్పిటాలిటి పరిశ్రమ వర్గాలను గోవా గవర్నర్ మృదులా సిన్హా కోరారు.
పణజి: స్వచ్ఛ భారత్ కోసం ఒకరోజు కేటాయించాలని హాస్పిటాలిటి పరిశ్రమ వర్గాలను గోవా గవర్నర్ మృదులా సిన్హా కోరారు. ప్రతినెల చివరి శనివారం 'క్లీన్ డే'గా పాటించాలని సూచించారు. కనీసం గంట సమయం పరిసరాల పరిశుభ్రత కోసం కేటాయించాలన్నారు.
గోవా పర్యాటక రాష్ట్రం అయినందున స్వచ్ఛభారత్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హాస్పిటాలిటి స్టేక్ హోల్డర్ల సమావేశంలో శుక్రవారం గవర్నర్ పాల్గొన్నారు.