చర్చిస్తామని చెప్పి పారిపోయారు: షబ్బీర్ | congress leader Shabbir Ali fire on trs govt | Sakshi
Sakshi News home page

చర్చిస్తామని చెప్పి పారిపోయారు: షబ్బీర్

Oct 9 2015 1:01 AM | Updated on Sep 29 2018 7:10 PM

చర్చిస్తామని చెప్పి పారిపోయారు: షబ్బీర్ - Sakshi

చర్చిస్తామని చెప్పి పారిపోయారు: షబ్బీర్

రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభంపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఏమీ మాట్లాడకుండానే ....

హైదరాబాద్: రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభంపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఏమీ మాట్లాడకుండానే పారిపోయిందని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ నిర్వహించకుంటే పదవులు పోతాయనే భయంతోనే సమావేశాలు నిర్వహించారని ఆరోపించారు.

ప్రతిపక్షాలు లేకుండా సభను నడపడం, శాసనసభను ఏడాదికి కేవలం 23 రోజులే నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపహాస్యం చేస్తున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement