అమెరికాలో కోడి పందేలు | cock fights in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో కోడి పందేలు

May 17 2017 9:25 PM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలో కోడి పందేలు - Sakshi

అమెరికాలో కోడి పందేలు

కోనసీమ కొబ్బరి తోటల్లో కోడి పందెం గురించి మనకు తెలుసు.

7వేల కోళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు
లాస్‌ ఏంజిలెస్‌(అమెరికా):
కోనసీమ కొబ్బరి తోటల్లో కోడి పందెం గురించి మనకు తెలుసు. కానీ అమెరికాలో కోడి పందెం గురించి తెలుసా? అమెరికాలో కోడిపందెమేంటి.. అనుకుంటున్నారా? అవును అక్కడ కూడా కోడిపందేలు జరుగుతుంటే అధికారులు రైడ్‌ చేసి మరీ 7వేల కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన పోలీసు దాడుల్లో ఇది అతిపెద్దదట. వివరాల్లోకెళ్తే.. లాస్‌ ఏంజిలెస్‌లోని వాయవ్య ప్రాంతంలో సోమవారం ఈ రైడ్‌ జరిగింది.

మొత్తం ఏడువేల కోళ్లు, మొబైల్‌ ఫోన్లు, పందెంలో వాడే కత్తులు, రెండు గన్స్, 50 కాపలా కుక్కలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే కొన్ని కోళ్లు చనిపోయాయని, స్వాధీనం చేసుకున్న శునకాలను జంతు సంరక్షణ కేంద్రాలకు అప్పగించామని అధికారులు తెలిపారు. పందెం కోళ్ల పెంపకం ఈ ప్రాంతంలో జోరుగా సాగుతోందని, మరికొన్ని ప్రాంతాల్లో కూడా కోడి పందేలు నిర్వహిస్తున్నారని, ఇందుకు కారకులైన 8 మందిని అదుపులోకి తీసుకున్నామని సీనియర్‌ అధికారి బాబ్‌ బోస్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement