రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేస్తా: కేసీఆర్‌ | cm kcr dares uttamkumar reddy to prove agreement on godawari waters | Sakshi
Sakshi News home page

రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేస్తా: కేసీఆర్‌

Aug 24 2016 5:23 PM | Updated on Sep 19 2019 8:44 PM

రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేస్తా: కేసీఆర్‌ - Sakshi

రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేస్తా: కేసీఆర్‌

గోదావరి జలాల విషయమై మహారాష్ట్రతో చేసుకున్న చారిత్మాత్మక ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ నేతలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

హైదరాబాద్: గోదావరి జలాల విషయమై మహారాష్ట్రతో చేసుకున్న చారిత్మాత్మక ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ నేతలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర పజలందరూ ఈ ఒప్పందంపై సంతోషంగా ఉన్నా.. కాంగ్రెస్‌ సన్నాసులు మాత్రం నల్లజెండాలు ప్రదర్శిస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. తమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ నేతలు అంతు, ఆధారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

నిన్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో అబద్ధాలు మాట్లాడారని, 152 మీటర్లకు తమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్రంతో ఒప్పందం కుదిరిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారని అన్నారు. 'ఇంకా 40 నిమిషాలపాటు నేను బేగంపేట ఎయిర్‌పోర్టులోనే ఉంటాను. నీకు దమ్ముంటే ఆ ఒప్పంద కాగితాన్ని తీసుకొని ఎయిర్‌పోర్ట్‌కు రా. నేను ఇక్కడి నుంచే రాజ్‌భవన్‌కు వెళ్లి నా రాజీనామా సమర్పిస్తాను. రాజకీయ సన్యాసం స్వీకరిస్తాను' అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్‌ నేతలు పచ్చి అబద్ధాలను దారుణంగా మాట్లాడుతున్నారని తూర్పారబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement