కారులో అత్యాచారయత్నమంటూ మహిళ ఫిర్యాదు | cab Drivers attempt rape on women in hyderabad | Sakshi
Sakshi News home page

అత్యాచారయత్నమంటూ ఫిర్యాదు, ఆసక్తికర విషయాలు

Jul 7 2017 11:56 AM | Updated on Aug 14 2018 3:14 PM

కారులో అత్యాచారయత్నమంటూ మహిళ ఫిర్యాదు - Sakshi

కారులో అత్యాచారయత్నమంటూ మహిళ ఫిర్యాదు

నడుస్తున్న కారులో ఓ మహిళపై అత్యాచారానికి యత్నించిన ముగ్గురు వ్యక్తులను ఘట్‌కేసర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నడుస్తున్న కారులో ఓ యువతిపై అత్యాచారానికి యత్నించిన ముగ్గురు వ్యక్తులను ఘట్‌కేసర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదారాబాద్‌ నుంచి వరంగల్‌ వస్తున్న క్యాబ్‌లో తనపై అత్యాచారయత్నం చేయబోతున్నారంటూ ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు వేగంగా స్పందించారు.

ఘట్‌కేసర్‌ దగ్గర క్యాబ్‌ను అడ్డుకుని మహిళను రక్షించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలో ఉండే మహిళ భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు శ్రీకాంత్‌  అనే వ్యక్తితో వివాహేత సంబంధం ఉన్నట్లు సమాచారం.

అయితే ఆ మహిళ ఖాజీపేటలోని గణేష్ టెంపుల్‌కు ఒంటరిగా వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ తన స్నేహితుల క్యాబ్‌లో వెళ్లి ఆమె తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో ఒంటరిగా ఎందుకు వెళ్లావు, ఎవరిని కలవడానికి వెళ్లావంటూ ఆమెను కొట్టాడు. దీంతో ఆమె తనపై అత్యాచారయత్నం జరుగుతోందంటూ మెసేజ్ పెట్టిందని పోలీసులు విచారణలో తేల్చారు. మహిళను కొట్టినందుకు శ్రీకాంత్‌, అతని స్నేహితులపై  కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement