
ఆరు రోజుల నష్టాలకు బ్రేక్
ఇటీవల నష్టపోయి ఆకర్షణీయ ధరల్లో ఉన్న బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా మంగళవారం స్టాక్ మార్కెట్...
బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు
31 పాయింట్ల లాభంతో 26,591కు సెన్సెక్స్
10 పాయింట్ల లాభంతో 8,061కు నిఫ్టీ
ఇటీవల నష్టపోయి ఆకర్షణీయ ధరల్లో ఉన్న బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా మంగళవారం స్టాక్ మార్కెట్ స్వల్పలాభాలతో గట్టెక్కింది. దీంతో ఆరు రోజుల ట్రేడింగ్ నష్టాలకు బ్రేక్ పడింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నా, కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 31 పాయింట్ల లాభంతో 26,591 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 8,061 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, గ్యాస్, పీఎస్‌యూ, విద్యుత్, ఫార్మా షేర్లు లాభపడ్డాయి.
బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, కన్సూమర్ డ్యురబుల్స్ షేర్లలో అమ్మకాలు నమోదయ్యాయి.కీలక రంగాలు నాలుగు నెలల గరిష్ట వృద్ధిని సాధించడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.5 శాతం వృద్ధిని సాధిస్తుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి మరింతగా మెరుగుపడుతుందని మూడీస్ సంస్థ వెల్లడించడం, భారత బ్యాంకింగ్ రంగం అవుట్‌లుక్ రేటింగ్‌ను ప్రతికూలం నుంచి స్థిరత్వం స్థాయికి ఈ సంస్థ పెంచడం... సానుకూల ప్రభావం చూపించాయని ట్రేడర్లు చెప్పారు. ఇన్వెస్టర్లు బిహార్ ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తుండడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగిస్తుండడం ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని వారంటున్నారు.