కర్ర, కరెంటు వైరుతో బాలుడికి చిత్రహింసలు | boy beaten by pastor with electrical wire in minnesota | Sakshi
Sakshi News home page

కర్ర, కరెంటు వైరుతో బాలుడికి చిత్రహింసలు

Dec 23 2016 11:37 AM | Updated on Sep 4 2017 11:26 PM

పన్నెండేళ్ల బాలుడిని పాస్టర్ క్రూరంగా హింసించాడు. ఈ సంఘటన అమెరికాలోని మిన్నెసోటాలో వెలుగుచూసింది.

మిన్నెసోటా: పన్నెండేళ్ల బాలుడిని ఓ పాస్టర్ క్రూరంగా హింసించాడు. ఈ సంఘటన అమెరికాలోని మిన్నెసోటా నగరంలో వెలుగు చూసింది. తన నమ్మకాన్ని కాదన్నందుకే బాలుడిని పాస్టర్ హింసించాడని పోలీసులు తెలిపారు. పాస్టర్ డాంగ్ వూక్(51) చర్చికి వచ్చిన బాలుడిని బంధించినట్లు చెప్పారు. ఆ తర్వాత కర్ర, ఎలక్ట్రిక్ వైర్లతో నాలుగు రోజుల పాటు చిత్రహింసలు పెట్టినట్లు వెల్లడించారు.
 
అతని చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేవుడు ప్రత్యక్షం కావడానికే తనను హింసిస్తున్నానని పాస్టర్ చెప్పినట్లు పేర్కొన్నాడు. నాలుగు రోజుల పాటు తనను దారుణంగా కొట్టి హింసించినట్లు తెలిపాడు. కాగా, పాస్టర్ తనయుడు జో సియోగ్ కిమ్(19) కూడా వేరొకరిని వేధించిన కేసులో ఏడాది క్రితం అరెస్టయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement