ఇండియన్ ముజాహిదీన్ హిట్ లిస్టులో షానవాజ్ హుస్సేన్! | BJP's Shahnawaz Hussain on Indian Mujahideen hit list | Sakshi
Sakshi News home page

ఇండియన్ ముజాహిదీన్ హిట్ లిస్టులో షానవాజ్ హుస్సేన్!

Dec 10 2013 12:38 PM | Updated on Mar 29 2019 9:18 PM

ఇండియన్ ముజాహిదీన్ హిట్ లిస్టులో షానవాజ్ హుస్సేన్! - Sakshi

ఇండియన్ ముజాహిదీన్ హిట్ లిస్టులో షానవాజ్ హుస్సేన్!

అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ హిట్లిస్టులో బీజేపీ నాయకుడు సయ్యద్ షానవాజ్ హుస్సేన్ పేరు ఉంది!!

అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ హిట్లిస్టులో బీజేపీ నాయకుడు సయ్యద్ షానవాజ్ హుస్సేన్ పేరు ఉంది!! ఈ విషయాన్ని బీహార్ పోలీసు అధికారులు మంగళవారం తెలిపారు. అగ్రస్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఉండగా, ఆ తర్వాత హిట్ లిస్టులో ఉన్నది షానవాజ్ హుస్సేన్ పేరేనని అధికారులు అన్నారు. పాట్నాలో నరేంద్రమోడీ ర్యాలీకి ముందు జరిగిన వరుస పేలుళ్లలో ఆరుగురు మరణించగా దాదాపు 100 మంది గాయపడిన విషయం తెలిసిందే.

భాగల్పూర్ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న షానవాజ్ హుస్సేన్.. బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆయన తరచు బీహార్తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆయనకు ఉగ్రవాద ముప్పు ఉందన్న విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ బీహార్ పోలీసులకు తెలిపింది. గత నెలలోనే ఈ మేరకు పాట్నా పోలీసులకు ఫ్యాక్స్ ద్వారా ఓ లేఖ పంపిందని, ఆ లేఖ అందగానే బీహార్ పోలీసులు, నిఘా సంస్థలు దాన్ని సీరియస్గా తీసుకుని ఎలాంటి పొరపాటుకు ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నాయని పోలీసులు చెప్పారు.

ఇటీవల నేపాల్లో రహస్యంగా సమావేశమైన ఇండియన్ ముజాహిదీన్ అగ్రనేతలు, భారతదేశంలోని బీజేపీ అగ్రనేతలు.. ముఖ్యంగా మోడీ, షానవాజ్ హుస్సేన్లను లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించారు. కొందరు బీజేపీ సీనియర్ నాయకులపై మావోయిస్టు దాడులు కూడా జరిగే ప్రమాదం ఉందని బీహార్ పోలీసు నిఘా విభాగం హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement