మీరు కన్యనో కాదో చెప్పండి! | Sakshi
Sakshi News home page

మీరు కన్యనో కాదో చెప్పండి!

Published Thu, Aug 3 2017 1:07 AM

మీరు కన్యనో కాదో చెప్పండి!

పట్నా: ఏదైనా ఉద్యోగంలో చేరేముందు అభ్యర్థి వివాహ స్థితి గురించిన సమాచారాన్ని సంస్థ అడగడం మామూలే. బిహార్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం ఉద్యోగంలో చేరేవారు కన్యనా కాదా అనే సమాచారాన్ని అడగడం పలువురి ఆగ్రహానికి కారణమవుతోంది. పట్నాలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఉద్యోగంలో చేరేవారు నింపాల్సిన దరఖాస్తులోని వివాహ స్థితి పత్రంలోని ఓ సెక్షన్‌లో ‘నేను బ్రహ్మచారి/వితంతువు/కన్య’ అని ఉంది.

అలాగే ‘నాకు ప్రస్తుతం జీవించి ఉన్న ఒకే భార్య ఉంది’, ‘నాకు పెళ్లైంది, ఒకరి కన్నా ఎక్కువ మంది భార్యలు ఉన్నారు’, ‘నేను పెళ్లి చేసుకున్న అతనికి జీవించి ఉన్న మరో భార్య లేదు’, ‘నేను పెళ్లి చేసుకున్న అతనికి జీవించి ఉన్న మరో భార్య కూడా ఉంది’ లాంటి వింత ఆప్షన్లు కూడా ఆ పత్రంలో ఉన్నాయి. అభ్యర్థి వీటిలో తనకు ఏది సరిపోలుతుందో దానిని టిక్‌ చేయాలి. వీటిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ, ఉద్యోగులపై అత్యాచారాలు జరిగినప్పుడు కన్యనా, కాదా అనే సమాచారం ఉపయోగపడొచ్చని చెప్పడం మరింత వివాదానికి దారి తీసింది.

Advertisement
Advertisement