ఎన్నికల బరిలో నిలబడటం,రేప్(అత్యాచారం)రెండు ఒకేలాంటివి అంటూ చేసిన వ్యాఖ్యలపై క్షమించాలని బెంగాలీ నటుడు దేవ్ రాష్ట్ర ప్రజలను కోరారు.
ఎన్నికల బరిలో నిలబడటం, రేప్ (అత్యాచారం) రెండూ ఒకేలాంటవేనని తాను చేసిన వ్యాఖ్యలపై క్షమించాలని బెంగాలీ నటుడు దేవ్ ఆ రాష్ట్ర ప్రజలను కోరారు. తాను రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించానని, మహిళలను తల్లిగా, సోదరిగా గౌరవిస్తానని చెప్పారు. ప్రజల మనస్సులు గాయపరచడం తన ఉద్దేశ్యం కాదన్నారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనసులైనా గాయపడి ఉంటే క్షమించాలన్నారు.ఈ మేరకు దేవ్ సోమవారం ట్విటర్లో పోస్ట్ చేశారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా, గట్టల్ లోక్సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున దేవ్ బరిలో నిలిచారు.
ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవ్ మాట్లాడుతూ... ఎన్నిక బరిలో నిలబడటం, రేప్ రెండు ఒక లాంటివేనని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. దేవ్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ చేయడమే కాకుండా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో దేవ్ దిగి రాక తప్పలేదు.