నాలుగు నెలల కనిష్టానికి డబ్ల్యుపీఐ | April WPI inflation slips to 3.85 pc as food prices cool | Sakshi
Sakshi News home page

నాలుగు నెలల కనిష్టానికి డబ్ల్యుపీఐ

May 12 2017 6:14 PM | Updated on Oct 4 2018 5:10 PM

టోకుధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ఠానికి దిగజారింది. ఏప్రిల్‌​ నెల డబ్ల్యుపీఐ 3.85 శాతంగా నమోదైంది.

న్యూడిల్లీ:  టోకుధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ఠానికి దిగజారింది.  ఏప్రిల్‌​ నెల డబ్ల్యుపీఐ 3.85 శాతంగా నమోదైంది. పదార్ధాల తయారీ, వస్తువుల ధరల ధరలు చల్లబడడంతో ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం  తగ్గింది.  ఏప్రిల్లో వినియోగ ధరల ద్రవ్యోల్బణం 2.99 శాతంగా నమోదైంది. మార్చ్‌లో ఇది 3.8 శాతంగా ఉంది. 2011-12 బేస్‌ ఇయర్‌గా   టోకు ధరల ద్రవ్యోల్బణ కొత్త సిరీస్‌ను ప్రభుత్వం  శుక్రవారం విడుదల చేసింది.   ఇందులో మొత్తం 697 అంశాలను కలిగి ఉండగా,   వీటిలో ప్రాథమిక  వస్తువులు 117, ఇంధన మరియు శక్తికి 16, తయారీ ఉత్పత్తులు 564  ఉన్నాయి.

ప్రభుత్వం  నేడు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్లో ఆహార ద్రవ్యోల్బణం 1.16 శాతంగా నమోదైంది. మార్చిలో 3.82 శాతం కన్నా తక్కువ. సీపీఐ ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ 0.61 శాతానికి పరిమితం అయింది. గత నెలలో ఇది 1.93 శాతంగా ఉంది. ఫుడ్ అండ్ బెవరేజెస్ ద్రవ్యోల్బణం 2.54 శాతం నుంచి 1.21 శాతానికి దిగి వచ్చింది. పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం 15.94 శాతానికి చేరుకుంది. కూరగాయల ధరలు మైనస్ 1.24 శాతం నుంచి -8.59 శాతానికి తగ్గాయి.ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 18.52 శాతంగా ఉండగా,  తయారీ రంగ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 2.66 శాతం నమోదైంది.  

కొత్త సిరీస్ డేటా ప్రకారం  ఫ్యూయల్ అండ్ లైట్ ఇన్‌ఫ్లేషన్ 5.56 శాతం నుంచి 6.13 శాతానికి పెరిగింది. క్లోతింగ్ అండ్ ఫుట్ వేర్ ద్రవ్యోల్బణం 4.6 శాతం నుంచి స్వల్పంగా తగ్గి 4.58 శాతంగా పరిమితమైంది.  గ్రామీణ ద్రవ్యోల్బణం 3.75 శాతం నుంచి 3.02 శాతానికి దిగి రావడం విశేషం. హౌసింగ్ ఇన్‌ఫ్లేషన్ 4.86 శాతానికి చేరుకుంది. ఇక పాన్ అండ్ టుబాకో ఇన్‌ఫ్లేషన్ 6.23 శాతం నుంచి 6.05 శాతానికి తగ్గింది. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు మార్చి నెలలో 2.7 శాతానికి తగ్గింది, అంతకు ముందు సంవత్సరం ఇది 5.5 శాతంగా ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement