'అది తెలుగు దద్దమ్మల పార్టీ' | APCC spokesperson Tulasireddy slams TDP | Sakshi
Sakshi News home page

'అది తెలుగు దద్దమ్మల పార్టీ'

Sep 11 2016 6:05 PM | Updated on Aug 18 2018 9:03 PM

'అది తెలుగు దద్దమ్మల పార్టీ' - Sakshi

'అది తెలుగు దద్దమ్మల పార్టీ'

ఇప్పుడు టీడీపీ అంటే తెలుగు దద్దమ్మల పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి విమర్శించారు.

మంత్రాలయం: తెలుగుదేశం పేరుతో ప్రస్తుతం మనుగడలోఉన్న పార్టీ ఎన్టీఆర్ స్థాపించింది కాదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి అన్నారు. ఇప్పుడు టీడీపీ అంటే తెలుగు దద్దమ్మల పార్టీ అని ఆయన విమర్శించారు. కపటనాటకాలతో తెలుగు ప్రజలను మోసం చేస్తున్నదంటూ టీడీపీపై విరుచుకుపడ్డారు.

కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ఎస్‌వీబీ అతిథిగృహంలో ఆదివారం విలేకరులతో మాట్లాడిన తులసిరెడ్డి.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, 108వ సెక్షన్ అమలు వంటి కీలక అంశాలు పొందుపర్చారని, ఈ మూడు సూత్రాలకు ఎన్డీఏ ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని మండిపడ్డారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయనందునే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామన్న కేంద్ర మంత్రుల వ్యాఖ్యల్లో నిజంలేదని, ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ ప్రత్యేక హోదా ఇవ్వరాదని ఎక్కడా సూచించలేదని తులసిరెడ్డి గుర్తుచేశారు. ఉద్దేశపూర్వకంగానే ఎన్డీఏ ఏపీకి ప్రత్యేక హోదాను నిరాకరిస్తోందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement