గ్యాంగ్ రేప్ కేసులో నలుగురికి మరణశిక్ష | all four convicts awarded capital punishment in gangrape and murder case | Sakshi
Sakshi News home page

గ్యాంగ్ రేప్ కేసులో నలుగురికి మరణశిక్ష

Apr 24 2015 3:34 PM | Updated on Sep 3 2017 12:49 AM

జమ్ము కాశ్మీర్లోని కుప్వారా ప్రాంతంలో 13 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను హతమార్చిన కేసులో నలుగురు దోషులకు కోర్టు మరణశిక్ష విధించింది.

జమ్ము కాశ్మీర్లోని కుప్వారా ప్రాంతంలో 13 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను హతమార్చిన కేసులో నలుగురు దోషులకు కోర్టు మరణశిక్ష విధించింది. తబిందా గని అనే అమ్మాయి 2007 సంవత్సరంలో స్కూలు నుంచి తిరిగి వస్తుండగా నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, చంపేశారు.

ఈ కేసును అత్యంత అరుదైనదిగా భావించి దోషులకు మరణశిక్ష విధించాలని బాధితురాలి కుటుంబసభ్యులు ఎప్పటినుంచో కోరుతున్నారు. నిందితులు సాదిక్ మీర్, అజర్ అహ్మద్ మీర్ ఇద్దరూ లాంగాటే ప్రాంతానికి చెందినవారు. మరో ఇద్దరు మోచి జహంగీర్ అన్సారీ పశ్చిమబెంగాల్కు చెందినవాడు కాగా, సురేష్ కుమార్ రాజస్థాన్ నివాసి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement