ఆ నటి బరువు 108: ఇంకా బరువు పెరగాలట! | actress was asked to gain more weight for a tv show | Sakshi
Sakshi News home page

ఆ నటి బరువు 108: ఇంకా బరువు పెరగాలట!

Mar 29 2017 4:53 PM | Updated on Sep 5 2017 7:25 AM

ఆమె బరువు 108 కిలోలు.. అయినా, తమ టీవీషో కోసం మరింత బరువు పెరుగాలని నిర్వాహకులు సూచించారు.

ఆమె బరువు 108 కిలోలు.. అయినా, తమ టీవీషో కోసం మరింత బరువు పెరుగాలని నిర్వాహకులు సూచించారు. వారికి ఆమె సింపుల్‌ గా నో చెప్పింది. ఇది  అంజలీ ఆనంద్‌కు ఎదురైన అనుభవం. ప్రముఖ చానెల్‌ స్టార్‌ప్లస్‌లో త్వరలో ప్రసారమయ్యే ’డాయి కిలో ప్రేమ్‌’  అనే టీవీ షోతో ఆమె తొలిసారి ప్రేక్షకులను పలుకరించబోతున్నది. అధిక బరువున్న అమ్మాయిగా ఈ షోలో నటిస్తున్నది. ఇప్పటికే ఆమె 108 కిలోల బరువు ఉండగా.. నిర్వాహకులు మరింత బరువు పెరగాలని, అప్పుడే షో కోసం బాగుంటుందని కోరారు. అయితే, వారి అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

‘నేను ఇప్పటివరకు ఎంతో చురుగ్గా జీవించాను. నాకు ట్రెక్కింగ్‌, సైక్లింగ్‌ ఇష్టం. నిలకడైన బరువును పాటించాను. ఇప్పుడు ఒక్కసారిగా బరువు పెరగమంటే నేను గట్టిగా నో అనే చెప్తాను. నేను ప్రస్తుతం 108 కిలోల బరువు ఉన్నాను. ఇంకా బరువు పెరగడం వల్ల ఇబ్బందులు ఎదురుకావొచ్చు’ అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొంది. డాయి కిలో ప్రేమ్‌’ ఏప్రిల్‌ 3 నుంచి స్టార్‌ ప్లస్‌ లో ప్రసారం కానుంది. ఈ షోలో అంజలి సరసన నటిస్తున్న మెహెర్‌జాన్‌ మజ్దా కూడా 16 కిలోల బరువు పెరిగాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement