అబుదాబి చెందిన ఎతిహాద్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో చెన్నై విమానాశ్రయంలో నిలిపివేశారు.
చెన్నై: అబుదాబి చెందిన ఎతిహాద్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో చెన్నై విమానాశ్రయంలో నిలిపివేశారు. సోమవారం ఉదయం విమానం పైకి ఎగరడానికి సిద్దమవుతున్న సమయంలో సాంకేతిక సమస్య వచ్చింది.
దీన్ని గమనించిన పైలట్ వెంటనే విమానాన్ని ఆపేశాడని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. విమానంలోని 117 మంది ప్రయాణికులకు వసతి కల్పించామన్నారు. సమస్యను పరిష్కరించిన తర్వాత వీరిని తమ గమ్యస్థానాలకు పంపిచనున్నారు.