మిలిటెంట్ కాల్పుల్లో ముగ్గురు పాక్ జవాన్లు మృతి | 3 soldiers killed in militants' attack in Pakistan Islamabad | Sakshi
Sakshi News home page

మిలిటెంట్ కాల్పుల్లో ముగ్గురు పాక్ జవాన్లు మృతి

Sep 14 2014 4:55 PM | Updated on Aug 28 2018 7:14 PM

పాకిస్తాన్ లో ఉగ్రవాదులు దాడులతో బీభత్సం సృష్టిస్తున్నారు.

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో ఉగ్రవాదులు దాడులతో బీభత్సం సృష్టిస్తున్నారు. పాకిస్తాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆదివారం చేసిన దాడిలో ముగ్గురు ఆ దేశ జవాన్లు మృతిచెందారు. ఉత్తర వజిరిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ జవాన్లపై మిలిటెంట్లు అగ్నిమాపక క్షిపణిలతో దాడి చేసినట్లు పాకిస్తాన్ అధికారి ఒకరు తెలిపారు. ఈ దాడిలో పాకిస్తాన్ కు చెందిన పలు రాకెట్లు ధ్వంసం కాగా, ముగ్గరు జవాన్లు అసువులు బాసారన్నారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు స్పష్ట చేశారు. జూన్ 15 వ తేదీన కరాచీ ఎయిర్ పోర్ట్ పై మిలిటెంట్లు దాడి చేసిన అనంతరం పాకిస్తాన్ బలగాలు ఆపరేషన్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ 950 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు పాక్ వర్గాలు స్పష్టం చేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement