ఆర్టిస్టులుగా జన్మించడం అదృష్టం- జబర్ధస్త్‌ టీం

Jabardasth team says We Lucky to Born as Artists

 ∙ నవ్వించడం ఒక యోగం   

శృంగవరపుకోట: కళాకారులుగా పుట్టటం,  ఆ కళ ద్వారా గుర్తింపు పొంది ..గౌరవం పొందడం మా అదృష్టమని జబర్ధస్త్‌ కళాకారులు అప్పారావు, బుల్లెట్‌ భాస్కర్, సునామీ సుధాకర్, వినోద్‌(వినోదిని)లు చెప్పారు. ఎస్‌.కోటలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రదర్శన ఇచ్చేందుకు శుక్రవారం ఎస్‌.కోట వచ్చిన వారు విలేకరులతో మాట్లాడారు. జబర్ధస్త్‌తో దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించడం ఆనందంగా ఉందని అప్పారావు చెప్పారు. ఎస్‌.కోట అల్లుడైన నేను ఈ ఉత్సవాల్లో భాగం కావడం అదృష్టమన్నారు.

ఎఫ్‌ఎం రేడియో జాకీగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా పని చేసి జబర్ధస్‌కు రావడం ఆనందంగా ఉందని బుల్లెట్‌ భాస్కర్‌ పేర్కొన్నారు. రాకెట్‌ రాఘవ, శ్యాంప్రసాద్‌రెడ్డి, నాగబాబులకు రుణపడి ఉంటానని తెలిపారు. సుధాకర్‌ మాట్లాడుతూ.. కామెడీ ఆర్టిస్ట్‌ అయినందుకు గర్విస్తున్నానని చెప్పారు.50 మంది కళాకారుల్ని పోషిస్తున్న మల్లెమాల శ్యాంప్రసాద్‌రెడ్డికి రుణపడి ఉంటామని తెలిపారు.మగవాళ్లు ఆడవాళ్ల గెటప్స్‌లో చేయడం కష్టమని వినోద్‌ చెప్పారు. వినోదినిగా వచ్చిన గుర్తింపును ఆనందిస్తున్నానని తెలిపారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top