నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర కొనసాగుతోంది. శనివారం ఉదయం ఆమె తన పరామర్శ యాత్రను
నల్గొండ : నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర కొనసాగుతోంది. శనివారం ఉదయం ఆమె తన పరామర్శ యాత్రను హుజూర్‌నగర్ నియోజవర్గం నుంచి ప్రారంభించారు. దిర్శినచెర్లలో వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తట్టుకోలేక ప్రాణాలు విడిచిన తుర్క లింగయ్య కుటుంబ సభ్యులను వైఎస్ షర్మిల పరామర్శించారు. లింగయ్య చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చారు.
కాగా షర్మిల రాక తమకెంతో ధైర్యాన్ని ఇచ్చిందని తుర్క లింగయ్య కుటుంబ సభ్యులు తెలిపారు. ఏ కష్టమొచ్చినా.. మేమున్నామని గుర్తుపెట్టుకోమంటూ రాజన్న బిడ్డ భరసో ఇవ్వడం ఊరట కలిగించిందంటున్నారు.