స్వీట్‌ ఫెస్టివల్‌లో వెయ్యి వెరైటీలు

World Sweet Festival Will Be Held From 13th January In Hyderabad - Sakshi

పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ భూపతిరెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: స్వీట్‌ ఫెస్టివల్‌లో వెయ్యి రకాల మిఠాయిలు ప్రదర్శించనున్నట్లు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ భూపతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం పర్యాటక భవన్‌లో స్వీట్‌ ఫెస్టివల్‌ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో స్వీట్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నామని తెలిపారు. స్థానికులతో పాటు, 20 దేశాల నుంచి దాదాపు 10 లక్షల మంది ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని చెప్పారు.

గతేడాది ఉత్సవాలకు 8 లక్షల మంది హాజరయ్యారన్నారు. విశేష స్పందన రావడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అతిథులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోహర్, తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, నిథమ్‌ డైరెక్టర్‌ డా.చిన్నమ్‌ రెడ్డి, తెలంగాణలో నివసిస్తున్న వివిధ రాష్ట్రాల అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top