భగీరథ యత్నం | Water Problems On Rabi Corp | Sakshi
Sakshi News home page

భగీరథ యత్నం

Mar 11 2018 11:54 AM | Updated on Oct 1 2018 2:19 PM

Water Problems On Rabi Corp - Sakshi

వాటర్‌ ట్యాంకర్‌తో వరి చేనుకు నీళ్లు పడుతున్న రైతు శ్రీనివాస్‌రెడ్డి

కొత్తకోట: రబీలో జిల్లాలోని కొత్తకోట ప్రాంతంలో పంటల పరిస్థితి దయనీయంగా మారింది. భీమా ఫేస్‌–1 కాల్వ వెంట తిర్మలాయపల్లి, వడ్డేవాట, అమడబాకుల, కొత్తకోట, కానాయపల్లి గ్రామాల రైతులు వరిసాగు చేస్తున్నారు.  వారబందీగా నీరు విడుదల చేస్తామని అధికారులు చెప్పడంతో సుమారు 400ఎకరాలకు పైగా వరి వేశారు. ఒకసారి కాల్వ ద్వారా నాలుగు గంటల పాటు విడుదల చేస్తే నెల రోజులకు సరిపడా నీరందుతుంది. కానీ అధికారులు నెలరోజులుగా కాల్వ ద్వారా విడుదల చేయడం లేదు. దీంతో కంకిదశలో ఉన్న వరి ఎండిపోతోంది.

ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. ఓ వైపు పంట ఎండిపోతుండడం.. మరోవైపు చేసిన అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. అద్దె ట్యాంకర్ల ద్వారా పంటలకు నీరందిస్తూ పంటలను కాపాడుకుంటున్నారు. రూ.వేలల్లో పెట్టిన పెట్టుబడులు నష్టపోవద్దంటే ఇంతకంటే తమకు మరోమార్గం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తకోటకు చెందిన రైతులు మోహన్‌రెడ్డి, దాబా శ్రీనివాస్‌రెడ్డి తదితరులు వరి పొలాలకు ట్యాంకర్లకు ద్వారా నీరు పారిస్తూ ఇలా కనిపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement