నల్లగొండలో ఓటరు జాబితా విడుదల

Voter List Released In Nalgonda Regarding Local Elections - Sakshi

నీలగిరిలోని 48 వార్డులకుగాను

39 వార్డుల్లో మహిళలే సింహభాగం

ఏడు మున్సిపాలిటీల పరిధిలో చిట్యాల, దేవరకొండలోనే తక్కువ

మిగతా మున్సిపాలిటీల్లో పురుషుల కన్నా మహిళలు ఎక్కువ

ఇంకా ప్రకటించని హాలియా జాబితా

సాక్షి, నల్లగొండ : మున్సిపాలిటీల తుది ఓటరు జాబితాలను శనివారం సాయంత్రం అధికారులు విడుదల చేశారు.  వారం రోజులుగా సామాజిక కుల గణన, ఓటరు ముసాయిదా జాబితాపై కసరత్తు చేసిన అధికారులు మొత్తం ఓటర్లను వార్డుల వారీగా విభజించి తుది జాబితా తయారు చేశారు.  నీలగిరి మున్సిపాలిటీ తుది ఓటరు జాబితాను  మున్సిపల్‌ కమిషనర్‌ దేవ్‌సింగ్‌ విడుదల చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో మొత్తం 1,27,044 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 62,215 మంది, మహిళలు 64,828 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, ఇతరుల ఓట్లను కూడా వార్డుల వారీగా లెక్క తేల్చి తుది జాబితాను తయారు చేశారు. పురుషల కన్నా మహిళలు 2,613 మంది ఎక్కువగా ఉన్నారు. 

39 వార్డుల్లో మహిళలే అధికం
నీలగిరి పట్టణంలో 48 వార్డులు ఉండగా అత్యధిక వార్డుల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మున్సిపల్‌ అధికారులు విడుదల చేసిన తుది ఓటరు జాబితా ప్రకారం 39 వార్డుల్లో మహిళా ఓటర్లు ఎక్కువ ఉండగా, 9 వార్డుల్లో పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 18,486మంది, ఎస్టీలు 1,483మంది,  బీసీలు 79,632, ఇతరులు ఒకటి, జనరల్‌ ఓటర్లు 27,443 మంది ఉన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలోని 48 వార్డులకు చెందిన కులాల వారిగా ప్రకటించారు.

మున్సిపాలిటీలో మొత్తం 87.431 మంది ఓటర్లు కాగా వీరిలో పురుషులు 42,744, మహిళలు 44,685 మంది ఓటర్లున్నారు. నందికొండ (నాగార్జునసాగర్‌) మున్సిపాలిటీలో 12 వార్డులుండగా 12,715 మంది ఓటర్లున్నారు.  ఇందులో పురుషులు 6,160 మంది, మహిళలు 6,555 మంది ఉన్నారు. చండూరు మున్సిపాలిటీలో 10 వార్డులకుగాను 10,055 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 5,128, మహిళలు 4,927 మంది ఉన్నారు.

చిట్యాల మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో 11,094 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 5,578 మంది,, మహిళలు 5,516 మంది ఓటర్లున్నారు. వీరిలో ఎస్‌టీ ఓటర్లు 132మంది, ఎస్‌సీలు 1975 మంది, బీసీలు 6337 మంది, జనరల్‌ 2,650 మంది ఉన్నారు.దేవరకొండ మున్సిపాలిటీలో 20 వార్డుల్లో 21,590 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 10,595 మంది పురుషులు, 10,995 మహిళలు ఉన్నారు. కాగా, హాలియా మున్సిపాలిటీకి సంబంధించి కమిషనర్‌ బాలకృష్ణ అందుబాటులో లేకపోవడంతో ఓటర్ల వివరాలను ప్రకటించలేదు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top