
కల్తీ పెట్రోల్‌పై వినియోగదారుల కన్నెర్ర
ఉప్పునుంతలలోని బాలాజీ ఫిల్లింగ్ స్టేషన్‌లో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని మంగళవారం ఉదయం వినియోగదారులు ఆందోళన చేశారు
♦ పెట్రోల్ బంకు వద్ద రెండు గంటల పాటు ఆందోళన
♦ స్టాక్‌ను విక్రయించరాదని తహశీల్దార్ ఆదేశం
♦ టెస్టింగ్ కోసం పెట్రోల్, డీజిల్ నమునాల సేకరణ
ఉప్పునుంతల : ఉప్పునుంతలలోని బాలాజీ ఫిల్లింగ్ స్టేషన్‌లో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని మంగళవారం ఉదయం వినియోగదారులు ఆందోళన చేశారు. పెట్రోలు పోయించుకొని కొద్దిదూరం వెళ్లగానే వాహనాలు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పెట్రోల్‌లో నీళ్లు కలిపారని వారు ఆరోపించారు. తాము పోయించుకున్న పెట్రోల్‌ను బైక్‌ల నుంచి తీసి బాటిళ్లలో పట్టి నీటిలా పేరుకుకోవడం చూపించారు. మొదటగా సిద్దాపూర్‌కు చెందిన బాలునాయక్ అనే కానిస్టేబుల్ ఉప్పునుంతలలోని బాలాజీ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకొన్నాడు. కిలోమీటర్ దూరం వెళ్లగానే బైక్ ఆగిపోయింది.
దీంతో అనుమానంతో అతను బైక్ మెకానిక్‌ను పిలిపించి చూపగా పెట్రోల్‌ను బాటిల్‌లోకి తీసి చూశారు. అందులో 30 నీరులా కిందకు పేరుకుకోవడంతో బంకు దగ్గరకు వచ్చి నిలదీశాడు. ఆ తర్వాత వరుసగా అంతకుముందు బంకులో పెట్రోల్ పోయించుకొని వెళ్తే తమ బైక్‌లు ఆగిపోయావని మరికొంతమంది వాహనదారులు అక్కడకు వచ్చి ఆందోళన వ్యక్తంచేశారు. బాధితులు ఫిర్యాదుచేయడంతో తహశీల్దార్ సైదులు పెట్రోల్‌ను పరిశీలించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తహశీల్దార్ ఎదుటే పెట్రోల్ పరీక్ష చేయించారు. తాము ఇక్కడ ఎలాంటి కల్తీకి పాల్పడలేదని ఇండిన్ ఆయిల్ కంపెనీ నుంచి వచ్చిన పెట్రోల్‌ను యధావిధిగా అమ్ముతున్నామని నిర్వాహకుడు తెలిపారు. కొంతమందికి పెట్రోల్ డబ్బులు వాపస్‌చేశారు.
కల్తీగా తేలితే కఠిన చర్యలు..
పెట్రోల్,డీజిల్‌లో కల్తీగా నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ సైదులు తెలిపారు. పెట్రోల్, డీజిల్ షాంపిళ్లను బాటిళ్లలో తీయించారు. ప్రస్తుతం కల్తీగా భావిస్తున్న స్టాక్ విక్రయాన్ని నిలిపేయాలని బంకు నిర్వాహకునికి సూచించారు. షాంపిళ్లను టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపనున్నామని తహశీల్దార్ తెలిపారు.