కొండపోచమ్మ సాగర్‌ పనుల్లో అపశృతి | Two People Died While Kondapochamma Sagar Reservoir Works | Sakshi
Sakshi News home page

కొండపోచమ్మ సాగర్‌ పనుల్లో అపశృతి

Jun 15 2019 1:50 AM | Updated on Jun 15 2019 1:50 AM

Two People Died While Kondapochamma Sagar Reservoir Works - Sakshi

గజ్వేల్‌రూరల్‌ : కొండపోచమ్మ సాగర్‌ కాల్వ నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. కాల్వ పనుల్లో నిమగ్నమైన ఇద్దరు కార్మికులపై కాంక్రీటు–సిమెంట్‌ మిక్చర్‌ మిల్లర్‌ లారీ జారిపడి మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం మక్తమాసన్‌పల్లి గ్రామంలో కొనసాగుతున్న కొండపోచమ్మ సాగర్‌ ప్రధాన కాల్వ నిర్మాణ పనుల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఇద్దరు కార్మికులు పనిచేస్తున్నారు. శుక్రవారం కాల్వలో సిమెంటు–కాంక్రీటు వేసేందుకు తీసుకొచ్చిన మిక్చర్‌ మిల్లర్‌ లారీ కాల్వపై భాగం నుంచి అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో కింది భాగంలో ఉన్న కార్మికులు దానికింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను బయటకు తీసేందుకు రాత్రి 10గంటలు దాటిన తర్వాత కూడా గ్రామస్తులు, పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.  మృతులను మహబూబ్‌నగర్‌ జిల్లా అప్పనపల్లి గ్రామానికి చెందిన సంజీవ్‌ (45), మహేశ్‌ (23)గా గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement