బాబు ఇంటి ముందు ధర్నా చేయండి: వినయ్ భాస్కర్ | TRS MLA Dasyam Vinay Bhaskar slams TDP leaders | Sakshi
Sakshi News home page

బాబు ఇంటి ముందు ధర్నా చేయండి: వినయ్ భాస్కర్

Nov 7 2014 1:56 PM | Updated on Aug 11 2018 6:42 PM

చర్చించే దమ్ములేక సభను అడ్డుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు.

చర్చించే దమ్ములేకే  సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు.  రెండోరోజు అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ వాస్తవాలు బయటపడతాయనే ఆందోళనతో టీడీపీ సభ్యులు సభ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారన్నారు.  చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చిన స్ర్కిప్టును సభలో చదువుతామంటే కుదరదని అన్నారు. ధర్నా చేయాలనుకుంటే టీడీపీ ఎమ్మెల్యేలు...చంద్రబాబు ఇంటిముందు చేసుకోవచ్చని  వినయ్ భాస్కర్ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement