తిరుగుబాటుపై వేటు | TRS is the expulsion of 17 persons | Sakshi
Sakshi News home page

తిరుగుబాటుపై వేటు

Mar 3 2016 2:14 AM | Updated on Oct 16 2018 6:15 PM

తిరుగుబాటు అభ్యర్థులపై టీఆర్‌ఎస్ వేటు వేసింది.

17 మందిని  బహిష్కరించిన టీఆర్‌ఎస్
 
హన్మకొండ: తిరుగుబాటు అభ్యర్థులపై టీఆర్‌ఎస్ వేటు వేసింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన నాయకులు రెబల్స్‌గా బరిలో ఉన్నారు. వీరు పోటీ నుంచి తప్పుకోక పోవడంతో పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంది. బహిష్కరించిన వారి వివరాలను టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు వెల్లడించారు. 

56వ డివిజన్‌కు చెందిన వల్లాల యాదగిరి, పెద్దమ్మ శ్రీనివాస్, గిన్నారపు రవీందర్, ఇమ్మడి రవీందర్, జన్ను కిషన్, వల్లాల గణేష్, ధీకొండ బిక్షపతి, ఆరెపల్లి కమలాకర్, పెద్దమ్మ శ్రీను, 19వ డివిజన్‌కు చెందిన గంట రవికుమార్, 22వ డివిజన్‌కు చెందిన గడ్డం యుగేంధర్, గడ్డం స్రవంతి, 20వ డివిజన్‌కు చెందిన సిద్ధం రాజు, 4వ డివిజన్‌కు చెందిన బిల్ల శ్రీకాంత్, బిల్ల కవిత, 13వ డివిజన్‌కు చెందిన ఓని భాస్కర్, నగరి స్వర్ణలత, 56వ డివిజన్‌కు చెందిన నాగమల్ల ఝాన్సీ, నాగమల్ల సురేష్‌ను బహిష్కరించినట్లు రవీందర్‌రావు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement