కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పంప్‌హౌస్ పైకప్పు శనివారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 11 మంది గాయపడగా.. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కొల్లాపూర్ నియోజకవర్గానికి తాగు నీరు అందించేందుకు ఎల్లూరు సమీపంలో పంప్‌హౌజ్, ఫిల్టర్‌బెడ్స్, సంప్‌వెల్ నిర్మిస్తున్నారు. నెలాఖరులోగా పూర్తిచేసి ట్రయల్‌రన్ నిర్వ హించాలనే లక్ష్యంతో అధికారులు వేగం పెంచారు. ఈ పనుల్లో ఎల్లూరు, బుసి రెడ్డి పల్లి గ్రామాలకు చెందిన 40 మంది కూలీలు పాల్గొన్నారు.
పనులు కొంతమేర చేపట్టిన వెంటనే శ్లాబ్ కోసం కట్టిన ఇనుప కడ్డీలు కుప్పకూలాయి. దీంతో కప్పు నిర్మాణ పనుల్లో ఉన్న కూలీలు దాదాపు 30 ఫీట్ల లోతులోకి పడిపోయారు. నక్క గౌరమ్మ, ఆకునమోని కుర్మయ్య, చింతల కృష్ణ, బుసిరెడ్డిపల్లికి చెం దిన సుజాత, రవి, తాళ్ల చెన్నమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వీరికి కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి, మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్ప త్రికి, హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకువెళ్లారు. కాగా, ప్రాజెక్టు సీఈ కృపాకర్‌రెడ్డి ఎల్లూరుకు వచ్చి వెళ్లి తర్వాత కొన్ని గంటలకే ఈ ప్రమా దం చోటుచేసుకోవడం గమనార్హం.
భగీరథ’ పనుల్లో అపశ్రుతి
Dec 24 2017 2:54 AM | Updated on Dec 24 2017 2:54 AM
Advertisement
Advertisement